Rs.199.00
Out Of Stock
-
+
కన్నడలో గత పది-పదిహేనేళ్ళల్లో ప్రచురింపబడిన గొప్ప నవలల్లో ''ఘాచర్ ఘోచర్'' ఒకటి. ఆధునిక నగర జీవితాన్ని తీసుకుని ఇంత సంవేదనాశీలంగా, సూక్ష్మంగా, హృద్యంగా విశ్లేషించిన నవల కన్నడలో రాలేదు. - గిరీశ్ కర్నాడ్
''డబ్బు మనల్ని ఆడిస్తుందనే మాట అబద్ధం కాదు. దానికీ ఒక స్వభావం, శక్తి ఉంటుందో ఏమో. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు అది మన ఆధీనంలో ఉండి, ఎక్కువైనప్పుడు దాని బలం పెరిగి మనల్నే ఆక్రమించతొడగుతుంది''
నగరంలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి దొరికిన చిరు వ్యాపార అవకాశం వల్ల ఆ కుటుంబంలోకి డబ్బులు ప్రవహిస్తూ వస్తాయి. ఈ హఠాత్పరిణామం వల్ల కుటుంబసభ్యులు తమను తామే కొత్తగా గుర్తించడం ప్రారంభిస్తారు. మారిన జగత్తులో వారి ఆశలు, ఆకాంక్షలు, నైతిక విలువలు మరియు తమ సంరక్షణ కోసం వారు వాడుకునే ఉపాయాలను కథ విప్పిచెబుతుంది.
పేజీలు : 99