ఈ సంకలనంలో 18 స్త్రీవాద కథలున్నాయ్‌. ఇవి అన్నీ ప్రముఖ స్త్రీవాద రచయిత్రులు, రచయితలు, 1948 నుండి 2017 వరకు వ్రాసినవి. ఒక్కొక్క కథలో రచయితలు ఆనాటి సాంఘిక పరిస్థితులు, స్త్రీలపై మతం విధించిన అణచివేత, దోపిడీ, అలాగే పురుషుల వలన స్త్రీలు కుటుంబ, సమాజ ఆధిపత్య, అణచివేతకు గురవటం లాంటి సమస్యలను సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాతక్రమంలో, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కారణంగా స్త్రీల జీవితాలలో మార్పులు రావటం; ఆర్థిక, రాజకీయ, సాంఘిక విద్యా రంగాలలో స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ప్రయత్నాలు, ఉద్యమాలు, స్త్రీ విద్యతో పితృస్వామ్య వ్యవస్థ పునాదులలో కదలికలు, స్త్రీలకు వయోజన ఓటుహక్కు, తల్లి, కుమార్తె, వితంతువులకు వారసత్వ హక్కులు, ముఖ్యంగా ఆడది తల్లి, భార్య, చెల్లిగా మాత్రమే ముద్ర వేయబడే ఒక లేబుల్‌ నుండి మనిషిగా గుర్తింపబడే స్థాయికి ఎదగటం, ఇలా 19వ శతాబ్దంలో స్త్రీవాద పరిణామ క్రమం చిత్రీకరించబడింది.

ఇందులో...

1.పిన్ని - కొడవటిగంటి కుటుంబరావు

2. బోన్‌సాయ్‌ బ్రతుకు - అబ్బూరి ఛాయాదేవి

3. మాఘ సూర్యకాంతి - పి.సత్యవతి

4. సుధీర - డా. ఆరేటి కృష్ణ

5. గోడలు - ఓల్గా

6. రిటైర్‌మెంట్‌ - ఇంద్రగంఇ జానకీబాల

7. సుశీల - డా.పాపినేని శివశంకర్‌

8. మసిగుడ్డ - కుప్పిలి పద్మ

9. పోగులు తెగిన అల్లిక - నల్లూరి రుక్మిణి

10. మనోవీథి - దాసరి శిరీష

11. గమ్యం దిశగా - అల్లూరి గౌరిలక్ష్మి

12. ఆ రాత్రి - డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి

13. స్ఫూర్తి - గోపాలుని అమ్మాజీ

14. నాలుగోతరం - జి.లక్ష్మి

15. ఊబి - డా. ఆలూరి విజయలక్ష్మి

16. ఒక భార్య ఒక భర్త - దగ్గుమాటి పద్మాకర్‌

17. కెరటాలు - భాగవతుల రమాదేవి

18. సర్దుబాటు - జ్యోతి సుంకరణం

అనే 18 స్త్రీవాద కథలున్నాయి.

పేజీలు : 132

Write a review

Note: HTML is not translated!
Bad           Good