ఇప్పటి పాకిస్తానులో ల్యాల్లపురం జిల్లా జఠవాలా తహసీలులో బంగ అనే ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో 1907 సెప్టెంబరు 27, శనివారం నాడు భగత్‌సింగ్‌ పుట్టాడు. ఆయన తండ్రి కిషన్‌సింగూ, పినతండ్రి స్వర్ణసింగూ ఇద్దరూ తమ విప్లవ కార్యకలాపాలకుగాను లాహోరు సెంట్రలు జైల్లో ఉన్నారు. ఇంకో పినతండ్రి అజిత్‌సింగు మండలె జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మండలె బర్మాలో ఉంది. బర్మా అప్పట్లో ఇండియాలో ఓ భాగంగా ఉండేది.

భగత్‌సింగ్‌ తాతగారు అర్జునసింగు ఆర్య సమాజంవాడు. ఆయన స్వామి దయానందుణ్ణి కలుసుకున్నాడు. ఉదారభావాలు కలవాడు. జాతీయోద్యమ కార్యకలాపాలవల్ల లాలా లజపత్‌రాయ్‌, భాయీ పరమానంద్‌, సూఫీ అంబాప్రసాద్‌, మహాత్మా హంసరాజులాంటి స్వాతంత్య్ర పోరాటయోధులతో భగత్‌సింగ్‌ కుటుంబానికి అతి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ రోజుల్లో యావత్తు పంజాబు అసంతృప్తితో కుతకుతలాడుతోంది. సర్వత్రా సభలు, సమ్మెలు, ఆందోళనలు జరుగుతున్నాయి...

పేజీలు : 38

Write a review

Note: HTML is not translated!
Bad           Good