Rs.150.00
In Stock
-
+
యోగి సలహా
ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడుపుతూ నాగరికత అన్నది లేకుండా జీవించారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికీ ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ధమవుతూ వచ్చింది.
ఆ కాలంలో దండాపథమనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యధేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పనీ సక్రమంగా కొనసాగించలేకపోయారు. ఎందుకంటే శ్రమ ఫలితం వారికి దక్కిన దాకా నమ్మకం లేదు.
దండాపథంలో సుమిత్రుడనే ఒక బుద్ధిశాలి ఉండేవాడు. తన దేశపు ప్రజల జీవితం దుస్థితిలో ఉండటం అతన్ని ఎంతో బాధించింది. దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెఇప్ప చూశాడు, కాని వారు వారి పద్ధతులను మార్చుకోలేదు. చివరకు సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళిపోయాడు...
పేజీలు : 308