Rs.150.00
Out Of Stock
-
+
ఇంతకుముందు వుడ్హౌస్ రాసిన 'ది ఓల్డ్ రిలయబుల్' నవలను 'ఆపద్భాంధవి ఉరఫ్ పాపాలభైరవి' పేరుతోనూ, ఆయనే రాసిన పది 'మల్లినర్' కథలను 'సరదాగా కాసేపు' పేరుతోనూ, 'అంకుల్ డైనమైట్' నవలను అదే పేరుతోనూ అనువదించిన శ్రీకృష్ణమోహన్ యిప్పుడు వుడ్హౌస్ రాసిన మరో నవల 'ఫ్రెజెన్ ఎసెట్స్' మీదికి దండెత్తేసి, దాన్ని 'లంకెబిందెలు'గా అనువదించారు. ''ఫ్రెజెన్ ఎసెట్స్' నవల బ్రిటీష్, అమెరికన్, ఫ్రెంచ్ జాతీయుల భేషజాలనూ, బలహీనతలునూ విలక్షణంగా చిత్రీకరిస్తుంది. నవలలో వున్న అనేకమైన పెద్దా, చిన్నా పాత్రలన్నీ రచయిత శ్రద్ధగా చెక్కినవే. వుడ్హౌస్ రచనలు చిత్రమైన హాస్యస్ఫోరకమైన అర్థాలంకారాలకు, ముఖ్యంగా చిత్రవిచిత్రమైన రూపకాలంకారాలకూ జగత్ప్రసిద్ధం. అలాంటి అలంకారాలను ఈ నవలలో కూడా వుడ్హౌస్ పుష్కలంగా దట్టించాడు.
Pages : 224