కొందరు వ్యక్తులు తమ లక్ష్యాలన్నిటినీ సాధించుకుంటుంటే, మరికొందరు మెరుగైన జీవితం కోసం కేవలం కలలు కంటూ వుండిపోతారెందుకు?  బెస్ట్‌ సెల్లింగ్‌ రచయిత బ్రయన్‌ ట్రేసీ మీ స్వప్నాలను సాకారం చేసుకునేటందుకు దారిచూపిస్తాడు.  కొన్ని లక్షల మంది ఈ మార్గాన్ని అనుసరిస్తూ పోయి అఖండ విజయాన్ని అందుకున్నారు.  ఈ పుస్తకంలో బ్రయన్‌ ట్రేసీ మీ కలలను సాకారం చేసుకునేటందుకు అవశ్యకం అయిన సిద్ధాంతాలను చెప్పాడు.
లక్ష్యాలను ఏర్పరచుకోవటం ఎలా?  వాటిని సాధించటం ఎలా?  దీనికోసం బ్రయన్‌ ట్రేసీ సరళమైన, శక్తివంతమైన, లాభకారి అయిన పద్ధతులను చెప్తాడు.  వీటిని ఉపయోగించి పదిలక్షలకుపైగా జనం అసాధారణ ఫలితాలను సాధించారు.
ట్రేసీ చెప్పిన 21 సిద్ధాంతాలను అనుసరించి మీరు మీ లక్ష్యాలను - అవి ఎంత గొప్పవి అయినప్పటికీ - సాధించుకోగలుగుతారు.  అంతేకాక, మీలోని వ్యక్తిగతమైన శక్తులని ఎలా గుర్తించాలో కూడా నేర్చుకుంటారు.  మీ జీవితంలో అన్నిటికన్నా విలువైనది ఏమిటి, భవిష్యత్తులో సాధించదల్చుకున్న లక్ష్యాలు ఏవి అనేదానిమీద దృష్టి పెట్టగలుగుతారు.  మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, ఎదుర్కొనే ప్రతి సమస్యనీ, అడ్డంకినీ ఎలా పరిష్కరించాలి, కష్టాలని ఎలా అధిగమించాలి, సవాళ్ళకి ఎటువంటి ప్రతిక్రియని ప్రదర్శించాలి, ఏది ఏమైనా ప్రతి లక్ష్యాన్నీ ఎలా సాధించుకోవాలి, అనే దాన్ని ట్రేసీ చూపిస్తాడు.  అన్నిటికన్నా ముఖ్యంగా నిరూపించబడిన ఒక విజయ వ్యవస్థని నేర్చుకుని, దాన్ని మీరు ఇక జీవితాంతం ఉపయోగించుకోగలుగుతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good