తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

లాహిరి :

ఉదయపు నీరెండలో పచ్చని పరిసరాలు తళతళలాడుతున్నాయి. మైమరచి ఆ పరిసరాలను చూస్తుంది అనుపమ. టూరిస్టుబస్‌ నింపాదిగా వెస్టర్న్‌ ఘాట్స్‌ మీదుగా ప్రయాణం చేస్తుంది. అనుపమకు తను ఓ బస్సులో ఉన్నానని గాని, తనతోపాటు నలభై మంది విద్యార్థినులు, పదిమంది అధ్యాపకులు ప్రయాణం చేస్తున్నారని గాని గుర్తులేదు. తాము వినోదయాత్రలకు వచ్చామని కూడా మరచిపోయింది. ఆమె ప్రకృతిని చూసి పరవశించి పోయింది. ఆ పచ్చని మెక్కలలో మొక్కయి ఊగాలనిపించింది. అనంతమైన గగనమార్గములో ఎగిరే పక్షులను చూస్తూ, తనూ ఓ విహంగమై విహరించాలనే కోర్కె కల్గింది. ఎర్రని నేలపై పచ్చని మొక్కలు అందంగా గమ్మత్తుగా ఉన్నాయి.

''మేడమ్‌!''

ఆమె చెవులకు ప్రకృతి పరిసరాలు పాడుకునే నిశబ్ద సంగీతములో మరే ధ్వనీ సోకలేదు.

''మేడమ్‌ అనుపమా!''

ఈసారి తల తిప్పింది. ఆ చూపుల్లో విసుగు కనిపించింది.

''ఫాతిమాగారు బ్రేక్‌ఫాస్టుకు ఆగుదామంటున్నారు'' బి.ఎస్సీ ఫైనలియరు విద్యార్థిని మాధవి అడిగింది...

పేజీలు :240

Write a review

Note: HTML is not translated!
Bad           Good