''లేడీస్‌ హెల్త్‌''లో స్త్రీలకు జీవితంలో ఎదురయే వివిధ సమస్యలు, వివరణలు, పరిష్కార మార్గాలు లభ్యం.

స్త్రీ తన బాల్యం నుండి జీవిత చరమాంకం దాకా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. సంతానోత్పత్తి కోసం ఆమె శరీరంలో తయారయే కొన్ని ప్రత్యేక హార్మోనులు ఆమెకు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో సమతుల్యం లోపిస్తే ఆమె శరీరాన్ని అంతగా ఇబ్బందులకూ గురి చేస్తాయి. ఇవి కాకుండా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నుండి గర్భాశయ క్యాన్సర్‌ దాకా ఆమె ప్రాణాన్ని హరింపజేసే వ్యాధులు మరెన్నో. ఇటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవడం ప్రతి స్త్రీకి ఎంతో అవసరం. అలాంటి పరిజ్ఞానాన్ని తెలియజేయటం డాక్టర్ల కర్తవ్యం.

స్త్రీలకు తమ శరీరం పట్ల అవగాహన కల్పించడానికి, తమ శరీరంలో జరుగుతున్న మార్పులలో ఏవి సహజమైనవి, ఏవి అనారోగ్యమైనవి, తదితర విషయాలు తెలుసుకోవడానికి 'లేడీస్‌ హెల్త్‌'' అనే ఈ పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుంది.

Pages : 287

Write a review

Note: HTML is not translated!
Bad           Good