తెలుగులోగిళ్ళకు విద్యుత్‌ కాంతులనందిస్తున్న కర్నూలుసీమ ఈ కవితా సంకలనం ద్వారా విద్వత్‌ కాంతులనందిస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రనిధి అయిన కర్నూలు సీమ యిప్పుడు ఆధునిక సాహిత్య కేంద్రంగా రూపుదిద్దుకొంటుందనడానికి ఈ సంకలనం ఒక ఆనవాలు.

-    పెనుగొండ లక్ష్మీనారాయణ

    జాతీయ కార్యదర్శి, అరసం

    ఇందులోని కవితలు గాడి తప్పుతున్న రాజకీయాల్ని ఎత్తి చూపుతున్నాయి. వదులౌతున్న మానవ సంబంధాలను పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. శ్రమ శక్తిని కీర్తిస్తున్నాయి. విడిపోతున్న జనాన్ని కలపడానికి ప్రయత్నిస్తున్నాయి. 'తమ సోమా జ్యోతిర్గమయ' అనే సంప్రదాయ భావనకు ఆధునిక వ్యాఖ్యానాలు ఈ కవితలు.

-    రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

    అరసం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good