యువత లో అలజడి, ఆశాంతి , దౌర్జన్య , ప్రవృత్తి , విద్వంసక చిత్తవృత్తి - ఇదొక సామాజిక రుగ్మతై పోయింది. తమ సంపద, హోదా గుర్తులో పెట్టుకుని శ్రీ మంతుల కుర్రాళ్ళు కొందరు ఎలాంటి బరితెగించే పనికైనా వెనుదీయని పరిస్థితి ఏర్పడింది. ఆ అవాంచనీయ ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది. పంటలకు పడుతున్న పురుగుల సంగతి సరే, కల్తి మందులమ్ముతున్న వాళ్ళ మాటేమిటి? ఇందులో దళారీ పనికి పూనుకుంటున్న వంచకుల మాటేమిటి ? వీళ్ళ సంఘానికి పట్టిన చీడ పురుగులు కారా? - ఈ కథల్లో రచయితా విచికిత్స , చింతన ఈ విధంగా కోనలు సాచింది. మనసుకు హత్తుకునే మరో కథ ఘూర్ఖావాలా ను గురించి రాసింది.సుదూర ప్రాతం నుంచి పొట్ట చేత బట్టుకుని వచ్చి, యీ పూటకాపూట మాత్రం గడిచి పోయే స్వల్ప సంపాదనతో కాలం వెళ్ళ బోస్ ఈ ప్రవాస జీవుల ఆత్మ ఘోష ఎంత హృదయ విదారకమో ఈ కథవల్ల తెలుస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good