ఆదివారం 'ఆంధ్రజ్యోతి'లో ముప్పై వారాలపాటు ధారావాహికంగా వడ్డించబడినవే ఈ 'కూర గాధలు'. ఎందరో పాఠకులు వీటి రుచిని ఆస్వాదించారు. ఇంకెందరో మరింత సమాచారం వడ్డించమన్నారు. అందరి ఆసక్తి, అభిరుచి మేరకు ఆ గాధలే తమ పూర్తి రూపంతో, రంగు రంగుల ఫోటోల తాలింపు ఘుమఘుమలతో కనువిందు చేసే పుస్తకంగా ముస్తాబై ఇలా మీ ముందుకొచ్చాయి.
'తెనాలి రామకృష్ణ కవి - శాస్త్రీయ పరిశీలన', 'శ్రమవీరులు', 'మహాకవి శ్రీశ్రీ - సిరికథ', 'పాండురంగ మహత్యం - ఒక పరిచయం', 'మన ప్రాచీనుల ఆహారం, ఆరోగ్యం, వైద్యం', '¬మర్‌ ఇలియడ్‌' (తెలుగు అనువాదం) వంటి తన రచనలతో పాఠకలోకాన్ని మెప్పించిన రచయిత ప్రతిభకు ఈ పుస్తకం తాజా సాక్ష్యం.
కూరగాయలు మనం నిత్యం వాడుకునేవే. అయితే వాటి గురించిన ఎన్నో విషయాలు మనకు బొత్తిగా తెలియవు. ఏయే కూరగాయలు ఎక్కడ పుట్టాయి? ఎప్పుడు, ఎలా మన ప్రాంతానికి వచ్చి చేరాయి? పలు భాషల్లో వాటిని ఏమని పిలుస్తారు? వాటి శాస్త్రీయ నామలేమిటి? అవెలా ఏర్పడ్డాయి? వివిధ కూరగాయలను ఎలా సాగు చేస్తారు? వాటితో మనం చేసుకునే ఆహారాలేమిటి? వాటి పోషక, ఔషధ విలువలేమిటి? వంటి ప్రయోజనకరమైన విషయాలన్నీ ఎంతో శ్రమకోర్చి లోతుగా పరిశీలించి, చాలా ఆసక్తికరంగా మన ముందుంచారు రచయిత. ఆయన ఈ గాథల్ని వివరించిన తీరు అందరినీ నోరూరింపజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆరగించి ఆనందించండి. - ప్రచురణకర్తలు

Write a review

Note: HTML is not translated!
Bad           Good