కుప్పిలి పద్మకు ఆధునిక స్త్రీవాద రచయిత్రిగా సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అర్బన్‌ మహిళల జీవనచిత్రాలను కథలుగా వెలువరించారు. మానవ సంంధాలలోని సంఘర్షణను కొత్తకోనంలోనూ, జెట్‌స్పీడుతో మారుతున్న ప్రపంచీకరణ పరిణామాల ప్రభావాన్నీ, ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగానూ వీరి కథలు విశ్లేషిస్తాయి. అమాయకత్వాన్ని కోల్పోతున్న ప్రపంచాన్ని కళ్లకు కట్టి దు:ఖ పెడతాయి. అంతిమంగా విలువల సంఘర్షణను అర్థంగా చిత్రిస్తాయి. ప్రకృతి సౌందర్యంతో అణువణువునా చిప్పిల్లే ఆ అక్షరాలు మంత్రనగరి సరిహద్దుల్లో విహరింపజేస్తాయి. మంచుపూల వానలో తడిపేస్తాయి. గుత్తులుగా గుత్తులుగా పూచిన పున్నాగపూలను ముద్దాడినట్టు వింత పరిమళంతో కమ్మేస్తాయి. కొన్ని పూలవనాల్లో కాసిన్ని తేనెచుక్కలు రంగరించి కొన్ని రంగురంగుల సాయంకాలాల్లో వాన చెప్పిన రహస్యాలను చెవుల్లో గుసగుసలాడతాయి.

''కుప్పిలి పద్మ కథలు''లో ద లాస్‌ ఆఫ్‌ యిన్నోసెన్స్‌, అజేయ, నా స్నేహితురాలి పేరు సుధీర, వాన చెప్పిన రహస్యం, మదర్‌హుడ్‌ ఎట్‌ రియాల్టీ చెక్‌, సెకండ్‌ హజ్బెండ్‌, గాల్లో తేలినట్టుందే, సహస్ర, బ్రేకప్‌ బొకె, పున్నమిలా వచ్చిపొమ్మని, యిన్‌స్టంట్‌ లైఫ్‌, ప్రకంపనం, సాలభంజిక, సర్వస్వం, యెడాలి చూపులు, చింతచెట్టు నీడలో వెచ్చని పరిమళపు పాట, ముక్త, నిర్ణయం, క్యూట్‌గర్ల్‌, కసాయి తల్లి, మమత, మసిగుడ్డ, అమ్మకో యిల్లు, చెమ్మగిల్లిన వసంతం, మాయ, ఎం.ఎస్‌.మయూర అనే 26 కథలు ఉన్నాయి.

పేజీలు : 320

Write a review

Note: HTML is not translated!
Bad           Good