కూనలమ్మ పదాలు - ఆరుద్ర
సాహిత్యం అర్ణవమైతే ..... ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే .... ఆరుద్ర విహరించని ఎత్లుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖలేదు, ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు.
కేవలం కవిత్వాన్నే తీసుకున్నా అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో! కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు - ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది.
అతని ''కూనలమ్మ పదాలు'' ప్రతిపద రమణీయం, పదపద చమత్కారకం. సమకాలిక జీవితం మీద చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో ఈ పదాలు రసప్రదాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good