కుమారీశతకశైలి సరళ సుబోధకమైనది. బచ్చెము, నిమ్మలము మొదలైన మాండలికములు కొన్ని ఉపయోగింపబడ్డాయి. 'గవ్వలవలె దంతములు', 'ఆకులలో పిందెలరీతి' వంటి చక్కని ఉపమానాలతో, బాగా పరిచయంలో ఉండే శబ్ద ప్రయోగాలు, ధారాళమైన చక్కని శైలి మొదలైనవి ఈ శతకపు ప్రత్యేకత.

ఆధునిక కాలంలో జీవనవిధానంలో వచ్చిన మార్పులను అనుసరించి కొన్నింటిని కొంతవరకు మార్చుకొని ఆచరించవచ్చు. కొన్ని యథాతథంగాను ఆచరింపవలసిన నీతులు ఉన్నాయి. ఏదైనా ఈ శతకంలోని విషయాలు కౌమార ప్రాయపు బిడ్డలు సన్మార్గంలో నడవటానికి తగిన ప్రేరణ కల్పిస్తాయనటం నిస్సందేహం.

పేజీలు : 59

Write a review

Note: HTML is not translated!
Bad           Good