19వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కాన్వెంటు చదువులు, ఇంగ్లీషు మాధ్యమాలు వచ్చిన తరువాత లేదుగానీ అంతకు ముందు ఈ శతకాలలోనివి, కనీసం ఒక పద్యమైనా నోటికి రాని బాలబాలికలు ఉండేవారేకారంటే అది అతిశయోక్తి కాదు.

ఫక్కి అనే ఇంటి పేరుగల వేంకట నరసకవి అనే అప్పల నరసయ్య ఈ శతక రచయిత. కుమార శతకం చివర కవి పేరు ఏమీ లేకపోయినా ఆయనే వ్రాసిన కుమీర శతకం చివర గల

ధరబ్రక్కి కులుడు వేంకట

నరసింహకవీంద్రుడిట్టి నడతలుధరపై

దెఱవల తెఱవులటంచును

జిరతరసత్కీర్తి వెలయజెప్పె కుమారీ

అని చెప్పిన దానిని బట్టి కవి పేరు తెలుస్తున్నది.

ఈ కవికి అప్పల నరసయ్య అనే ఉపనాం కూడా ఉన్నది. ఈ కుమారి శతకం రౌద్రినామ సంవత్సరం పుష్యమాసంలో అంటే 1860 వ సంవత్సరంలో వ్రాసినట్లుగా నరసింహ కవే తెలిపాడు. కవి స్వయంగా 'పక్కికులోద్భవుడు అప్పలనరసింహుడు అని తనను గురించి తెలుపుకొన్నాడు.

పేజీలు : 62

Write a review

Note: HTML is not translated!
Bad           Good