దళిత బహుజన దార్శనికులు డాక్టర్‌ కత్తి పద్మారావుగారు సామాజిక శాస్త్రవేత్త. దళితుల యుగకర్త. కుల నిర్మూలన ఆయన ధ్యేయం. కులం పునాదులు, కులం ప్రత్యామ్నాయ సంస్కృతి, కుల సంఘర్షణలు. దళితుల చరిత్ర ఐదు భాగాలు..ఇంకా ఎన్నో గ్రంథాలు సామాజిక శాస్త్రం మీద ప్రామాణికంగా రాసిన రచయిత. కులం పునాదులు 1979లో రాసిన గ్రంథం. అన్ని విశ్వవిద్యాలయాల్లో సామాజిక శాస్త్ర పరిశోధకులకు ప్రణాళికగా ఉన్న గ్రంథం. డాక్టర్‌ బి.ఆర్‌.అంబద్కేర్‌ కుల నిర్మూలన గ్రంధానికి ఇది విస్తృతి. కులాన్ని, దాని పునాదుల్ని శాస్త్రీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిశోధించి అనేక నూతన విషయాల్ని సమాజానికి అందించిన గ్రంథం ఇది. ఈ గ్రంథం రాయడం కోసం డాక్టర్‌ కత్తి పద్మారావు నాగరలిపిలో ఉన్న మనుస్మృతి, పరాశర స్మృతి, తదితర గ్రంథాలను పరిశీలించి అనేక లోతైన అంశాల్ని తెలుగు పాఠకులకు అందించారు. దీని పునాదిగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కుల నిర్మూలనకు సిద్ధపడే ప్రతి కార్యకర్తకు ఈ గ్రంథం ఒక కరదీపిక. కులం మీద లోతుగా పరిశీలించే ప్రతి పరిశోధకునికి ఈ గ్రంథం ఒక ప్రణాళిక. ఈ గ్రంథం తెలుగు సామాజిక చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని తెరిచిన గ్రంథం. డాక్టర్‌ కత్తి పద్మారావు గారిని సామాజిక శాస్త్రవేత్తగా ప్రపంచం ముందు నిలబెట్టిన గ్రంథం ఇది. అభినవ అంబేద్కర్‌గా ఆయనను ఈనాడు కొనియాడటానికి కారణమైన ప్రముఖమైన గ్రంథం ఇది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good