కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు ఉంది. ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతిపాదించబడినట్టివనే ప్రతీతి ఉంది. ఆ ఋషులు మానవాతీత శక్తులు కలవారని, మహా జ్ఞానులని, అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. అందువ్ల - కులవ్యవస్ధను వదులుకొమ్మని ప్రజలను కోరడం వారి ప్రాథమిక మత భావాలకు విరుద్ధంగా వారిని నడుచుకోమనడమే.

మొదటి రెండు రకాల సంస్కరణలు సులభమే కావచ్చు. కాని, ఈ తరహా సంస్కరణ - కుల నిర్మూలనా చాలా మహత్తరమైన పని. చాలా వరకు అసాధ్యమైన పని కూడా కావచ్చు. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాదిస్తారు. అందువల్ల మీకు కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది. అంటే శాస్త్రాల యొక్క, వేదాల యొక్క అధికారాన్ని నిర్మూలించవలసి ఉన్నదన్నమాట.' - డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good