క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షేత్రయ్య పదాలు ఈ మధుర భక్తికి మచ్చుతునకలు! అంటూ ప్రవచించాడొక లాక్షణిక శిరోమణి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good