కష్టసుఖాల కథలు
జీవితపు లోతుల్ని తాకుతూ వరలక్ష్మి రాసిన కథల పుస్తకం 'క్షతగాత్ర'. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాక ఉద్యోగం పోవడంతో, ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ పరిస్ధితుల్లో...అక్షరస్పర్శ తెలీని ఓ పడవవాడు ఆ ఆలోచనని ఎలా మార్చడో 'కలకానిది విలువైనది' కథలో వివరించారు. ఆర్ధిక వ్యవహారాలు సహా ఇంటి విషయాలన్నీ భార్యకూ తెలియజేసి, ఆమె భాగస్వామ్యాన్ని తీసుకోవలసిన అవసరాన్ని 'చుక్కాని లేని నావ' కథ చక్కగా తెలిపింది. మతాలూ ఆచార వ్యవహారాలూ మనుగడ సవ్యంగా సాగేందుకు మనిషి చేసుకున్న ఏర్పాట్లే. అంతకు మించి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పన్లేదని తేల్చేసే కథ 'వెనక్కి నడుస్తున్నామ'. కొన్ని కష్టాలూ, కొన్ని సుఖాలు, కొన్ని ఆవేశాలు, ఇంకొన్ని ఆలోచనలూ...మొత్తంగా జీవితంలోని కోణాలన్నీ సంకలనంలోని పద్దెనిమిది కథల్లో ఉన్నాయి. - లక్ష్మీహరిత

Write a review

Note: HTML is not translated!
Bad           Good