స్వామీ తలుపుల్ని పరిశీలిద్దాం. తాళంచెవులు ఇక్కడే ఉన్నాయి. లోపల ఏముందో తాళం తెరిచి చూద్దాం'' అన్నాడు అన్నారావు.
''పిచ్చోడా! అదంత తేలికైన పననుకుంటున్నావా? పొరపాటున తలుపును తాకావంటే అయిపోతావ్‌. చాలా ప్రమాదం. తలుపు గొళ్ళేనికి వేలాడుతున్న రంగుదారాల్ని, వాటిపైన వున్న బొమ్మల్ని గమనించావా? ఎవరుబడితే వాళ్ళు తెరవటానికి వీల్లేకుండా ఒక్కో గది తలుపుల్ని ఒక్కో బంధంతో బంధించివుంచారు. అమ్మా స్నిగ్ధా ఆ అక్షరాల్ని ఓసారి చదువుతల్లీ'' అన్నాడు. ఆమె చదివి చెప్పి ఆమె చెప్పిన ప్రకారం ఆ అక్షరాలు అది ఏ దేవత గదో చెప్తున్నాయి.
మొదటి గది ఆదివిష్ణుమూర్తిది కాగా మిగిలినవి ఒక్కో లక్ష్మికి ఒక్కో గది కేటాయించబడింది. అంటే ఎవరి నిధిని వారి గదిలోనే భద్రంచేసివుండాలి.
నిధిని చూడబోతున్న ఆనందంలో ఉన్నా అందరికీ అనంతస్వామి మాటలతో ఒక్కసారిగా నీరసం వచ్చినంత పనయింది.
''ఏమిటి స్వామీ. తలుపుల్ని తెరవలేమా?'' అడిగాడు కృతయుగ్‌.
''ప్రస్తుతం తెరవలేం'' వెంటనే బదులిచ్చాడాయన.
''అంత సులువుగా తెరుచుకోవు నాయనా. చూస్తున్నారుగా. అడుగుగునా మంత్రశక్తులతో ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేశారో. ఆదివిష్ణుగదికి నాగబంధం వేశారు. వరుసగా గదులకి గరుడబంధం-మండూకబంధం-వృశ్చికబంధం-గంధర్వబంధం ఇలా తొమ్మిదిగదులకు నవ బంధాల్ని ప్రయోగించి పెట్టారు. ఆ బంధాలు విప్పి దారాలు బొమ్మలు తొలగించకుండా తొందరపడి తాళం తెరిచే ప్రయత్నంచేస్తే నెత్తురుకక్కుకు చస్తారు. ఆ చావు చాలా ఘోరంగా ఉంటుంది'' వివరించాడు.
షాక్‌తో నిలబడిపోయాడు అన్నారావు. పొరపాటున తలుపుల్ని తీసివుంటే అయిపోయేవాడు. సమయానికి అనంతస్వామి ఆపబట్టి బతికిపోయాడు.
''ఇవన్నీ అంత ప్రమాదకరమైన బంధాలా?'' ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు కృతయుగ్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good