'క్రొవ్వుఱాళ్ళు' అపరాధకపరిశోధక నవల కాదు. మనిషి డబ్బుకు ఎంత గడ్డి తింటాడో ధనవంతుడైనా సరే పరిస్థితులను బట్టి ఎలా దిగజారతాడో చెప్పే నవల. క్రొవ్వురాళ్ళంంటే 'సానబెట్టని ముడిరత్నాలు'.

క్రొవ్వుఱాళ్ళులో అసలు దాగున్న రత్నాన్ని పసిగట్టి వెల గట్టాలంటే దాని చుట్టూ ఉన్న కొవ్వును కొయ్యాలి, సానబెట్టాలి. అప్పుడే నిజమైన దాని రంగు బయటపడ్తుంది. ఈ అర్థాన్ని రచయిత తన నవలలో శ్లేషార్థంలో చాలా చక్కగా ప్రధాన పాత్రలెలా ముసుగులో లోకాన్ని భ్రమింప జేశాయో చెప్తాడు.

నవల రెండు భాగాలు. మొదటి భాగంలో తొమ్మిది ప్రకరణాలు. రెండవ భాగంలో ఎనిమిది ప్రకరణాలు. శ్రీనివాసానికి క్రొవ్వుఱాళ్ళు దక్కటం నుండి, వెంకటేశం కొడుకు కృష్ణమూర్తి ఆ రాళ్ళ నడగటానికి శ్రీనివాసం ఇంటికి రావటం వరకూ మొదటి భాగం. కృష్ణమూర్తీ, సీతారామూ, శ్రీనివాసమూ ఈ రాళ్ళను తామే దక్కించుకోవాలని వేసే ఎత్తుల పై ఎత్తులతో రెండవ భాగం ఆరంభమై శ్రీనివాసం మరణంతోనూ, రాళ్ళను కృష్ణమూర్తి వస్తే ఇవ్వమనటంతో ఆఖరవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good