కృష్ణవేణి (నవల) - రంగనాయకమ్మ

ఈ నవలను రంగనాయకమ్మ గారు రాసిన కాలం 1959. పుస్తకంగా గతంలో 7 ముద్రణలు వచ్చింది. ఇది 8వ ముద్రణ. ఈ ముద్రణకి ముందుమాటలో రంగనాయకమ్మ గారు ఇలా అన్నారు.

''కృష్ణవేణి''ని ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలనుకోవడం డబ్బు దృష్టితో కాదు. దీని ధర పెట్టిన డబ్బునైనా వెనక్కి తెచ్చేలాగ ఉండదు. నష్టాన్నే తెస్తుంది కాబట్టి దీన్ని ఇవ్వడం డబ్బుకోసం కాదు. 'కీర్తి' కోసం అసలే కాదు; వస్తే 'అపకీర్తే' వస్తుంది కాని కీర్తి కాదు.
ఈ కథ అంటే నాకు మొదటి నుంచీ ఇస్టమూ, భయమూ కూడా, నాకు తెలిసిన కొన్ని సంఘటనల మీదే దీన్ని తయారు చేసాను కాబట్టి అనుకుంటాను ఇష్టం. సరిగా రాయలేదని అసంతృప్తి ప్రారంభమైనప్పటినుంచీ భయం.
ఈ నవలని మళ్ళీ ఇవ్వడం అవసరమనీ, ఉపయోగమనీ, ఊగిసలాట లేకుండా స్థిరమైన అభిప్రాయం ఏర్పడిన వెంటనే, ఆ పుస్తకాన్ని అలమారు మూల నుంచి బైటికి తీసి, ఒక్కసారి కూడా చదవకుండా కంపోజింగుకు ఇచ్చేశాను. కంపోజై వచ్చిన పేజీలు చదువుతోంటే, కథని నేను పూర్తిగా మరిచిపోయినట్టే, కొత్త కథని చదువుతున్నట్టే అనిపించింది. మొట్టమొదటి పేజీ నుంచి ఎక్కడ నాకు నచ్చని విషయం కనబడ్డా ఫుట్‌ నోట్లు రాయడం మొదలు పెట్టాను. అవి మొత్తం 152 అయ్యాయి. తర్వాత చివరి విషయాలు కూడా రాశాను. ఇన్ని విమర్శలు చేర్చాక, ఈ పుస్తకం అంటే ఇప్పుడు భయం తగ్గింది. ఈ విమర్శలన్నీ ఇష్టంగా ఉన్నాయి.

గతంలో ''ఇక కృష్ణవేణి రాదు'' అని చెప్పి, ఇప్పుడు ''ఇక కృష్ణవేణి వస్తుంది'' అని చెప్పడం అంటే ఇది మాట తప్పడమే. కానీ ఇప్పుడు ఇందులో అనేక విమర్శలు చేర్చాను కాబట్టి, దీని వల్ల పాఠకులకు మేలే గాని హాని లేదు. ఈ కథలో పరిశీలించి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ అవసరం కోసమే నా మాట తప్పాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good