దివిసీమలో ఎండలు ముదిరినాయి; ఎండవలసిన చెట్టూచేమా ఎండుకొచ్చినాయి. ఎండు పట్టడం మ్రాకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది.

అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న -

అవనిగడ్డ గ్రామంలో వున్న బ్రాహ్మణ్యంలో యించుమించు అందరూ ఓపాటి మోతుబరులే - చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి; పువ్వులతోబాటు పత్రిలాగా.

ఆ బహు కొద్దిమందిలోనూ, ఓ విధంగా చూస్తే ప్రథమ గణనీయుడు యితగాడు!

తిండికి బొటాబొటిగా సరిపోయే గింజలు రాలే చేనుంది. పప్పూ ఉప్పు వగైరాలంటె - వున్నదినాళ్ల నడుమ కనుక, ఏదో నోటి మంచితనాన ఎలాగో సర్దుకుపోవడం పరిపాటి అయింది. అది యీ తరంలో పుట్టింది కాదు; తండ్రి నాటి నుంచి వస్తున్న ఆనవాయతి.

అయితే, తండ్రి హయాములో - కొంత మెరుగు! ఆయనకు పిత్రార్జితం మూడెకరాలన్నర పైచిలుకుండేది. ఆయన స్వతంగా చేసుకునేవాడు. తీరువా అని, సిస్తనీ, యీ అమాంబాపతులూ పోను యింటికో నలభై బస్తా చేరేది. అది వారికి ఎక్కీ దక్కీ - అదీ గాకుండా, ఆయనకు రకరకాల వ్యాపకాలు ఉండేవి. నిత్యమూ రాత్రిపూట పురాణము జెప్పేవాడు. సంపన్న గృహస్థుల యింట్లో - అంతేగాకుండా, స్మార్తం క్షుణ్ణంగా చెప్పుకున్నవాడేమో! పౌరోహిత్యంలోకి దిగలేదన్న మాటేకాని, కాస్త ముక్కూ మొగం ఎరుగున్న వాళ్లింట్లో ఏ పూజో, పుణ్యాహవాచనమో అంటూ ఏదన్నా తలపెడితే - అందుకు ముందీ అన్నప్ప సిద్ధం!...

పేజీలు : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good