నిత్య సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. అర్ధశతాబ్దంపైగా ప్రపంచమంతటా పర్యటించి ప్రసంగించారు. వివిధ దేశాల మేధావులతో, శాస్త్రజ్ఞులతో మానవ సమస్యలను గురించి అపూర్వమైన తీరులో చర్చలు, సంభాషణలు జరిపారు. మానవుడిని సమస్త బంధనాల నుండి విముక్తం చేయడమే తమ ఆశయమనీ, మతాల, సంస్థల, గురువుల ఆధిపత్యంలో కాకుండా స్వీయ జ్ఞానంగల స్వతంత్రజీవిగా మనిషి పయనించాలనీ వుద్భోధించారు.

''సంఘర్షణ వున్నంతకాలం శక్తి వృథా అవడం జరుగుతుంది. స్వేచ్ఛవున్నప్పుడే శక్తి శిఖరాగ్ర స్థాయిలో వుంటుంది.... ఈ ఘర్షణ నుంచి, యీ సంఘర్షణ నుంచి విముక్తి పొండడం ఎట్లా అనేది మనమే శోధించి, అన్వేషించి తెలుసుకుందాం. మీరూ, నేనూ కలసి అన్వేషిస్తూ శోధిస్తూ, ప్రశ్నిస్తూ యీ ప్రయాణం చేయబోతున్నాం. అనుసరిస్తూ మాత్రం కాదు. తరచి శోధించాలంటే స్వేచ్ఛ వుండి తీరాలి. భయం వున్నప్పుడు స్వేచ్ఛ వుండదు. భయం అనే భావాన్ని బాహ్యంగానే కాదు, అంతర్గతంగా కూడా మనం మోస్తూ వుంటాం.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good