హాస్పిటల్ !
స్పెషల్ వార్డులో వున్నా గది తలుపులు నిశబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది. గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో వున్నారు. అతని ండు చేతులు మణికట్టు దగ్గర కట్లు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే అవంతి కాళ్ళ మంచి నీళ్ళ జలజలా రాలాయి. . నిన్న ఇదేమిటి ? అని తను అడిగినందుకు జవాబుగా ఆతను మనికట్ల దగ్గర నరాలు  బ్లేడుతో కోసుకొని చచ్చిపోవటానికి సిద్దం అయాడు.
డాక్టర్ సామర్ద్యం వల్ల  ప్రాణగండం గడిచింది. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తల దాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది . కట్టుకట్టిన చేతోనే ఆమెని గుండెల మీదికి లాక్కున్నారు. అతని కంఠం మత్తుగా ఉంది .
అవంతి !నన్ను వదిలి ఎక్కడికి వేళ్ళవు  వేళ్ళవు  కదూ !
వెళ్ళాను తరుణ్ వెళ్ళాను ఆవంతి  మాటలని దుఖం వెల్లువలా వచ్చి ముంచేసింది.
నీకు నీకు కృష్ణ లోహిత - అంటే తెలుసా ? అస్పష్టంగా అడిగాడు.
తెలియదన్నట్టు తల తిప్పింది.
"కృష్ణ లోహిత " అంటే - నలుపు వర్ణం కలిసిన ఎరుపు రంగు, నలుపు అంటే చీకటి శూన్యం ! ఎరుపు అంటే రక్తం ! హత్య ! నా మనసు యీ రెండింటిలో ఏది చెయ్యాలో తెలియక కొట్టుమిటాడుతోంది ! నాకు యీ రెండూ తప్ప ఇంకో దోవ లేదా అవంతీ -ఇంకో దోవ లేదా ? ఆటను మత్తులోనే ఏడుస్తున్నాడు. కొద్ది సేపటికి శాంతించినట్లు నిద్ర పోయాడు. ఇది వినగానే, నీళ్ళు నిడిన అవంతి కళ్ళలో ఆశ్చర్యం ! అయోమయం !భయం ! ఏమిటి దీని అర్ధం ! అది ఏం కలవరింత ?
ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మరో నవలా రాజం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good