మనమూ మన దేహ స్థితి అనే ఈ పుస్తక శ్రేణి , ఫిజిక్సు , కెమిస్ట్రీ , బయాలజీలు చదువుకుని , ఆధునిక వైద్యంలో ఔషధవైద్యమును గురించి మాత్రమే తెలుసుకోగోరే వారికై ఉద్దేశింపబడ్డది .అందులో ఆరవదైన క్రిమి దోషములు నివారణ - - క్రిమి దోషములు నిరోధము అనే ఈ పుస్తకములు బాక్టీరియముల వల్ల కలిగే రోగములు, వాటి నివారణ నిరోధములను గురించి వివరిస్తున్నవి. నిత్య విద్యాభ్యాసంలో తటస్థించే కేసులలో అధిక భాగం క్రిమి దోషములే , అత్యంతాధునిక వైద్యగ్రంధముల నుండి ముఖ్యములు అని నాకు తోచిన విషయ సేకరణ చేసినందున , ఔషధ ప్రయోగములలో సాధక బాధకములను గురించి రోగ నిరోధ విధానములను గురించి ప్రత్యక శ్రద్ధ వహించినందున ఇది వైద్య విజ్ఞాభిలాషులందరికి - వారు విద్యార్దులుగాని ,అభ్యాసకులు గాని జ్ఞానార్దుల కానీ- ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good