సాధారణంగా అర్థశాస్త్రం అనగానే ఎకనామిక్స్‌ అనే అర్థంలో అనుకోవడం పరిపాటి. కాని నేడు అర్థశాస్త్రంగా పేర్కొనేదానికీ, కౌటిల్యుని అర్థశాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదనేది గమనించాలి. కౌటిల్యుడు తన గ్రంథాన్ని అర్థశాస్త్రమని పేర్కొన్నాడు. దండనీతిని అర్ధశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతాన్ని బట్టి మనకు తెలుస్తుంది. భారతంలో ప్రముఖుడైన అర్జునుడు అర్థశాస్త్రంలో నిష్ణాతుడని శాంతి పర్వములో పేర్కొనబడినది. ఇంకో చోట శ్రేష్టులయిన రాజులు అర్థశాస్త్రాన్ని అనుసరిస్తారని కూడా చెప్పబడింది. అయితే దండనీతికి గల ఈ పేరు అంత ప్రచారంలో లేదనే చెప్పవచ్చు. ఆఖరుకు కౌటిల్యుడు కూడా విద్యల సంఖ్యను చెప్పేటప్పుడు అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే పేర్లు చెప్పాడు. కాని ఎక్కడ ప్రత్యేకించి అర్ధశాస్త్రమనే మాట వాడలేదు. దానికి బదులుగా దండనీతి అనే ఉపయోగించాడు. అందువల్ల ఈ దండనీతి అనే బహుళ ప్రచారంలో వున్నది. కాబట్టి కౌటిల్యుని అర్ధశాస్త్రంలోని ప్రధాన విషయ వస్తువు రాజనీతికి సంబంధించినది, మనకు లభ్యమవుతున్న అతి ప్రాచీన గ్రంథము అర్ధశాస్త్రమని చెప్పవచ్చు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good