...మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరంవున్న బస్‌స్టాప్‌లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగావున్న ఒక స్త్రీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలను, గోడలనూ పట్టుకుని మళ్లీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ్లు పీక్కుపోయి గమ్మత్తుగా, అసహ్యంగా వున్నాయి. జుత్తు దువ్వుకుంది కాని చాలా మట్టుకు వూడిపోవటంతో విగ్గు పెట్టుకున్నట్టుగా వుంది. సన్నగా పుల్లల్లాగైన చేతులూ, ఇంతెందుకు-ఆమె అభిమానులు చాలామంది పక్కనే స్కూటర్ల మీద వెళ్లరు. ఆఫీసుకు టైమై పోయిందంటూ గబగబా నడుస్తూ వెళ్లారు. కాని ఆమెను గుర్తించనే లేదు. నడకలో, దూరం నించి చూస్తే ఇంకా కనిపించకుండా వున్న ఆమె అనాకారితనం దగ్గరిగా నిలబడి మాట్లాడితే స్పష్టమైంది. జాలిగా, అడుక్కుంటున్నట్టుగా చూసే ఆ కళ్లూ, చెక్కిళ్లు పీక్కుపోగా, ఎముకలకు అంటుకున్నట్టుగా వున్న మొహం, పెద్దగా తెరిచే ఆ నోరూ - ఒకప్పుడు వీనస్‌, ఆఫ్రోడైట్‌ కలిసి జన్మఎత్తినట్టుగా కనిపించిన మనోరమ ఆమె...

Write a review

Note: HTML is not translated!
Bad           Good