''కొత్త కథ 2018'' 24 కథల కథా సంకలనం.

''కొత్త కథ 2018''లో అన్ని రకాల కథలూ ఉన్నాయి. కొన్ని కథలు నవ్విస్తాయి. కొన్ని ఏడిపిస్తాయి. మరి కొన్ని ఆలోచింపజేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా - ఎప్పుడూ చెప్పుకునే రాజుగారు పట్టుకున్న ఏడు చేపల కథ కాకుండా, మనం ఎప్పుడూ చెప్పుకోని ఏటికి ఎదురీది దొరక్కుండా పోయిన చేప కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.

తెలుగు కథ చాలా ఏళ్లపాటు తన సృజనాత్మక విలువలను సామాజిక బాధ్యతకు తాకట్టు పెట్టింది. సమాజపు కట్టుబాట్ల మధ్యలో మనిషి పడే కష్టాలే చాలావరకూ తెలుగు కథలకు వస్తువుగా సమకూరింది. సామాజిక బాధ్యత ముఖ్యమే! కానీ ప్రస్తుత అమానుష ప్రపంచంలో మనిషి అంతకంటే ముఖ్యం. సమాజం విధించిన బూటకపు కట్టుబాట్లను వ్యతిరేకించిన నడిచిన మనిషి కథ ఇప్పుడు మనకు అత్యంత అవసరమేమో! ఈ సంకలనంలో మేము గమనించిన ఒక ప్రత్యేకమైన అంశం ఇదే!

ఇండ్ల చంద్రశేఖర్‌ రచన 'మాతమ్మ అలియాస్‌ స్టెల్లామేరీ', కరుణకుమార్‌ రచన 'పుష్పలత నవ్వింది', రిషి శ్రీనివాస్‌ రచన 'నక్షత్రాలు లేని నేల' కథల్లో ఈ అంశాన్ని మనం గమనించవచ్చు.

అలాగే మంచి కథకి మరో గుణం కూడా ఉంది. మనకు తెలియని జీవితాన్ని కళ్ల ముందు ఆవిష్కరించే ఏ కథ అయినా కూడా ఎప్పటికీ నిలబడుతుంది. ఉదాహరణకు, కృష్ణజ్యోతి రాసిన 'దురాయి' కథే తీసుకుంటే, ఒకింత అరవ పదాలతో తెలుగు భాషని కలిపి మాట్లాడే పట్టపోళ్ల జీవితాన్ని, వారి జీవనశైలిని మన ముందుంచారు. అలాగే సుధాకర్‌ ఉణుదుర్తి 'చేపకనుల రాజకుమారి' కథలో గతించి పోయిన రాజవంశీకుల జీవితాలను కళ్ల ముందుకు తీసుకొచ్చారు.

పేజీలు : 254

Write a review

Note: HTML is not translated!
Bad           Good