ఆచార్య సచ్చిదానంద మూర్తి గారు మహాజ్ఞాని,

రేయింబవళ్ళు శ్రమించి తనదైన రీతిలో

తత్త్వశాస్త్రానికి, సామాజిక శ్రేయస్సుకు, ప్రపంచ

సౌభాగ్యానికి తన రచనల ద్వారా, ప్రసంగాల

ద్వారా తన శక్తిని ధారపోసిన మహనీయులు.


కేవలం సామాజిక సమస్యలనే కాదు, ప్రపంచంలోని

అన్ని తత్త్వాలలోని సారాన్ని సమన్వయం చేసి ఒక

నూతన తత్త్వాన్ని రూపొందించి, దాని ద్వారా

ప్రపంచాన్ని ఏకం చేయాలనే కోరిక ఆచార్య

మూర్తిగారికి ఉండేదని నేను వినడం తటస్థించింది.

ఉదాహారణకు : కేరళలోని మూడు

విశ్వవిద్యాలయాలలో వేరువేరుగా ప్రసంగిస్తూ, జీసస్‌,

మహమ్మద్‌, బుద్ధుడు, కృష్ణుడు ఏమి చెప్పారనే దాని

గురించి బుర్రలు బ్రద్ధలు కొట్టుకునే బదులు వారు

చెప్పిన దానిలో మంచిని పాటించినట్లయితే మత

సామరస్యం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

- ఆచార్య డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

Pages : 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good