శ్రీమతి స్వర్ణ ప్రభాతలక్ష్మి రచనలు ఎక్కువగా చదువు సంస్కారం వున్న మధ్య తరగతి అమ్మాయి మనసుకి అద్దంలా కన్పిస్తాయి. 'అద్దానికి అవతలి వైపు' కథలో హీరోయిన్‌ సంఘమిత్ర స్నేహానికి హద్దులు చెరిపేసి, అది ప్రేమ అనుకుని భ్రమతో రామకోటి అనే అతన్ని వివాహం చేసుకున్నా త్వరలోనే అంతర్మథనం మొదలవుతుంది. రామకోటి ప్రేమికుడుగా చెప్పే తీయని మాటకి - భర్తగా ఆమె జీవితలో ప్రవేశించి చెలాయించే అధికారానికి ఆమె కలత చెందుతుంది.

చివరికి పనిమనిషి తన జీవితాన్ని మలుచుకున్న ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకుని జీవన గమ్యం నిర్ణయించుకుంటుంది. ఇందులో ప్రేమ అనే భ్రమకి చదువుకున్న యువతి అతీతురాలు కాదని తెలుస్తుంది.

'కాలచక్రం' కథలో రిటైర్‌ అయిన తర్వాత మనిషి పడే ఆవేదన, ఆరాటం, జీవితంలో ఏదీ అనుభవించలేదనే అశాంతితో కుటుంబ సభ్యుల్ని విసుక్కోవడం రాఘవయ్య కారెక్టర్‌లో కనిపిస్తుంది.

ఈ విధంగా ప్రభాతలక్ష్మి కథలు అన్నీ మధ్య తరగతి మనిషికి మనో దర్పణాలుగా మన కళ్ళ ముందు నిలుస్తాయి.

- యద్దనపూడి సులోచనారాణి

ప్రేమలు, పెళ్ళిళ్ళు, సంఘర్షణలు, నిరాశలు నిండిన కథలు - 'అద్దానికి అవతలవైపు', 'కుడిఎడమైతే', 'కన్నె మనసు', 'శ్రుతి తప్పిన రాగం', 'మార్పు', 'అపరాజిత' అయితే వేషభాషలను బట్టి ఎవరినీ అంచనా వేయగూడదు అని చెప్పేవి - 'పురుగులు', 'రంగుటద్దాలు'. 'అనుభవం' శ్రుతిమించని శృంగార కథ.

- పి.ఎస్‌.నారాయణ

Pages : 154

Write a review

Note: HTML is not translated!
Bad           Good