ఈ వ్యాసాల్లో రాష్ట్ర ఆవిర్బావ, ఆనంద పారవశ్యం ఉంది. తెలంగాణ దృష్టి కోణం ఉంది. తెలంగాణ అవసరాలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధికి సూచనలు ఉన్నయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఉన్నయి. భవిష్యత్‌ తెలంగాణ కర్తవ్యాలున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతోపాటు, తక్షణ అవసరాల ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భాష వేరు, అభివృద్ధి వేరు, ఆగ్రహం వేరు, ఆవేదన వేరు. ఆ వాక్యాల్లో ఆవేశం, ఉద్యమం, ఉద్రేకం, ఆందోళన, ఉద్యమంలో ఉరికించే ఉత్తేజం. నినాదాలు, కార్యాచరణ... నిరాశా నిస్పృహలో ఫోనిక్స్‌ పక్షిలా తిరిగి జన్మించడం... ఉద్యమంలో ఎన్నో చర్చలు... ఉద్యమనేత కేసిఆర్‌ గారితో కొన్ని వందల గంటలు, రోజులు ఏకాంతంలో ఎన్నో చర్చలు... భవిష్యత్‌ గురించిన అంచనాలు, ఆశలు, ప్రణాళికలు, ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు అందరి సూచనల సమగ్ర స్వరూపమే టిఆర్‌ఎస్‌. ఎన్నికల ప్రణాళిక. దానికదే ఒక సమగ్ర లక్ష్య ప్రకటన. తేజోమయమైన భవిష్యత్‌కు అదొక దిక్సూచి. అంతకు మించిన ఆచరణ కార్యక్రమాలు కూడా ముందుకు సాగినయి. ముల్కీ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. తెలంగాణ భాషకు, సంస్కృతికి గౌరవం వచ్చింది. అభివ్యక్తిలో హోదా, హుందా, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం.

అలా రాష్ట్రం సిద్ధించినంక ఆనందం. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, బాధ్యత, కర్తవ్యం, అందర్ని కలుపుకుపోయే సహనం. ఔదార్యం, విశాలదృష్టి, విశ్వదృష్టి, భయపడేవారికి మనమే ఓదార్పును, మద్దతు యివ్వడం. ఇందులోని వ్యాసాల్లో శైలీ శిల్పం, అభివ్యక్తిలో ఈ మలుపు గమనించవచ్చు.

పేజీలు : 304

Write a review

Note: HTML is not translated!
Bad           Good