స్వాతి” వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన ముళ్లపూడి వెంకటరమణ ఆత్మకథ మొదటి భాగం ఇలా పుస్తకరూపంలో..... బాపు బొమ్మలతో....

ఇది తారీకులవారి ఆత్మకధ కాదు. మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్రమణం చేస్తూ, కొత్త కొత్త పదభంధాలను అల్లుతూ, చమత్కార శైలితో మనని మురిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుపోయి ఆ యా మనుషుల మద్య విహరింపజేసారు.

‘కోతి కొమ్మచ్చి’చదువుతుంటే లోపలనుండి పొంగుకువచ్చేది నవ్వో, ఏడుపో తెలీదు. దారిద్ర్యాన్ని ఇంత రొమాంటిక్‌గా చూడవచ్చా !? అని ఆశ్చర్యం కలుగుతుంది. కొన్ని ఆకలి జోకులు చదువుతుంటే నవ్వొచ్చి అంతలోనే తమాయించుకుకుని ‘నవ్వకూడదేమో, జాలిపడాలి కాబోసు’ అనిపిస్తుంది.

కాని జాలిపడమని రమణ ఎక్కడా అడగలేదు. జీవితంలో అన్నీ చూసిన వేదాంతి నిర్వేదంతో తన జీవితాన్ని పొరపాట్లతో సహా సమీక్షించుకుంటున్నట్లుగా, ఉన్నదున్నట్లుగా రాసుకుపోయారు. డ్రమటైజ్ చేయవలసిన అవసరం లేకపోయింది. కావలసినంత డ్రామా సహజంగానే వుంది ఆయన జీవితంలో...

Write a review

Note: HTML is not translated!
Bad           Good