రాధ అతడి బిత్తర చూపుల్ని చూసి ఫక్కున నవ్వింది.
"రోజులతోపాటు మనుష్యులూ మారాలి!"
"నిజమే! కానీ మనం పాతతరం మనుష్యుల్లానే బ్రతుకుతున్నాం కదా!".
"కొత్తతరపు మంచిని స్వీకరించడం తప్పా?"
"పెద్దవాళ్ళకు మనస్థాపం కలిగించనంత వరకూ తప్పుగాదు!"
మంచం మీద మోకాళ్ళమీద తల ఆనించుకొని అతడి వంకే సాలోచనగా చూస్తూ కూర్చున్నది రాధ.
"వాళ్ళకు మనస్థాపం కలగకుండా అయితే చేయడంలో తప్పులేదు గదా!" క్రింది పెదవిని తెల్లటి పంటితో కొరుక్కుంటూ అన్నది.
సారధి ఆమె తనను ఎటువైపుకు తీసుకువెళుతున్నదో అర్థంగాక అయోమయంగా ఆమెనే చూస్తున్నాడు కన్నార్పకుండా.
"చెప్పండి!"అన్నది చూపుడు వేలును అతడి బుగ్గమీద పెట్టి మురిపెంగా నొక్కుతూ.
అతడు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good