"ఒక సినిమాని ప్రేక్షకుడిగానేకాక రచయితగా, నాయకుడిగా, ఒక చిన్న పిల్లవాడిగా, ఒక మాస్ ప్రేక్షకుడిగా, ఒక మేధావిగా,
ఒక కెమరామన్ గా అన్నికోణాలనుంచి చూసినప్పుడు  చాలా విషయాలు లోతుగా అర్ధమౌతాయి".
ఇది 'మల్టీ డైమన్షనల్ ధింకింగ్'.
"నిందించడం అనేది ఎయిడ్స్ కన్నా భయంకరమైన  అంటువ్యాధి. చెవుల ద్వారా వ్యాపిస్తుంది"
ఇది యువత అనుక్షణం స్మరించాల్సిన వ్యాక్యం.
కార్తికేయ రచనా శైలి యువతరం శైలి. మాట్లాడుకుంటున్నట్లుంటుంది. అలాగే ఉండాలి కూడా. ఆ శైలిలో ఒక వేగం ఉంది. యౌవనరాగమూ ఉంది.
'కార్తికేయ' రచన ప్రతి ఒక్కరినీ సమర్ధంగా ప్రభావితం చేస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అది సత్యం కూడా!
- రాళ్లబండి కవితా ప్రసాద్

Write a review

Note: HTML is not translated!
Bad           Good