"... తన ఆత్మకథను మూడు భాగాలుగా గ్రంథస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గిన దశలో ''సాహితీసర్వస్వం'' మార్కెట్‌లోకి వచ్చి అదరగొట్టింది. ''భాగవతం'' టీవీ సీరియల్‌ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన క్రియేటివిటీ తగ్గలేదని, ప్రజాదరణ కోల్పోలేదని "శ్రీరామరాజ్యం" నిరూపించింది..
ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి, కుమారుడు, కుమార్తె రాయగా...
సాహిత్యం గురించి "సాహితీసర్వస్వం" సంకలనకర్త శ్రీ ఎమ్బీయస్‌ ప్రసాద్‌ రాయగా...
సినిమాల గురించి, టీవీ సీరియల్స్‌ గురించి శ్రీ బివియస్‌ రామారావుగారు ('సీతారాముడు') రాశారు. ఆయన రమణగారికి హైస్కూలు రోజుల్నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోను పాలుపంచుకున్నారు. మంచి రచయిత, సినిమా కళపై అవగాహన కలిగినవారు. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాక రమణ రచన చేసిన సినిమాలన్నిటినీ చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు - తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించారు.
బాపుగారు పర్యవేక్షించి, ముందుమాట రాశారు.
అనేక అరుదైన ఫొటోలతో అచ్చమైన "బాపురమణీయం"గా రూపొందిందీ - "కొసరు కొమ్మచ్చి"...."
- వరప్రసాద్, ప్రచురణకర్త

Write a review

Note: HTML is not translated!
Bad           Good