ఏదో అప్పుడప్పుడూ కాసిన్ని కవితల వంటివి రాసుకునే నాకు చాలాకాలంగా లోలోన ఉగ్గ బట్టుకున్న అక్షరాలు కట్లు తెంచుకునేందుకు, బయటపడేందుకు ప్రయత్నించినట్లనిపించింది. మాట్లాడాల్సిన సంతగులనేకం వున్నట్లనిపించింది.

ఓపలేని దు:ఖం, ఆగ్రహం, తండ్లాట నా లోలోపల లుంగలు చుట్టుకుని, నన్ను కుదిపేసి ఏ దిగంతాల అంతాలకో నన్ను విసిరేస్తే, నన్ను నేను అనేక మార్లు గాయపరుచుకుని, ఏది మనది అనుకుని స్థిమితపడే క్షణాలలో అది మనది కాదన్న ఎరుక, హృదయాన్ని గుండుసూది మొనపైన నిలిపి గిర్రున తిప్పేస్తే, అనేకమార్లు అట్లా పగిలిపోయి, శకల శకలాలుగా చెదిరిపోయి, మళ్ళీ నన్ను నేను పోగేసుకుని, నన్ను నేను నిలబెట్టుకుని, రక్తసిక్త దారులలో పాదముద్రల ఆనవాళ్ళని వెతుక్కుంటూ, వే9సారిపోతూ, తెగిన గాలిపటాల్లా ఎగిరిపోయిన కలల సీతాకోకచిలుకల్ని పట్టుకునేందుకు నిస్సహాయంగా చేతులు చాచి, మరల మరల స్వప్నాల్ని, దారుల్నీ, నా విశ్వాసాల సారంగిని అన్వేషిస్తూ, నా అంతరాంతరాళంలో జరిగే నిత్య సంఘర్షణల మధ్య, నా అంత:ర్లోకాలలో సదా ఒంటరినై సంచరిస్తూ, రాయలేనితనమేదో నన్ను కమ్ముకున్న వేళ, ఇట్లా రాస్తూ....

Pages : 215

Write a review

Note: HTML is not translated!
Bad           Good