కొన్ని కావ్యాలు కొందరు కవులు
ఈ పుస్తకం మొదటి ఆరు వ్యాసాలు ప్రాచీన తెలుగుకవిత్వం మీద, తక్కినవి ఆధునిక తెలుగుకవిత్వం మీద రాసినవి. పింగళి సూరన రాసిన ప్రభావతీ ప్రద్యుమ్నం మీద పరిశోధన పూర్తి చేసిన కొత్తలో రాసిన వ్యాసం మొదటిది. నాపూర్వాశ్రమం తెలుస్తుందిలే అని ఈ గ్రంధంలో చేర్చాను.
అనివార్యంగా నాలుగైదు వ్యాసాలలో ప్రాపంచిక దృక్పథాన్ని చెప్పవలసి వచ్చింది. పునరుక్తులు, పున్ణపునరుక్తులు తప్పలేదు. ఎందుకంటే రచయితలను అంచనా కట్టడానికి వాళ్ళ ప్రాపంచిక దృక్పథమే కీలకం గనక మళ్ళీ మళ్ళీ దానిని ప్రస్తావించవలసి వచ్చింది. నా విమర్శలు చదివిన మిత్రులు కొందరు  నా విమర్శలో కవిత్వోదాహరణలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు. ఇది నిజమే. అయితే నాకు తెలిసే అపని చేస్తాను. ఎందుకంటే ఒక అభిప్రాయానికి పనికివచ్చే కవిత్వ ఖండికల్ని ఒకచోట ఉదాహరిస్తే పాఠకులకు శ్రమ తగ్గుతుంది. పైగా అందరికీ అన్ని కావ్యాలు దొరకవు కదా!

Write a review

Note: HTML is not translated!
Bad           Good