కర్నూలు పేరు చెప్పగానే మనందరి కళ్ళముందు తళుకున్న మెరిసేది కొండారెడ్డి బురుజు మాత్రమే. ఇది నగరం నడి బొడ్డులో వుండి అందరినీ ఆకర్షిస్తూవుంది. దీనిపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగు వైపులా వున్న బురుజులో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిథిలమయిపోయినా నేటికీ చెక్కు చెదరకుండా నిలిచివున్నది కొండారెడ్డి బురుజు మాత్రమే.

    శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి విక్టరీ టాకీస్‌ పక్కన వుంది. దీనిని ఎర్రబురుజు అంటారు. ఎర్రని ఇసుకరాయిచే నిర్మించబడడంవల్ల దానికి ఆ పేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు వున్నాయి. ఎర్రబురుజు గోడలపై అనేక చిన్నచిన్న బొమ్మలను బురుజు రాళ్ళపై మనం గమనించవచ్చు.

    మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని వున్నాయి. ఒకటి కుమ్మరి వీధిదాటాక, మరొకటి సాయిబాబా గుడిముందున్న బంగ్లా పక్కన వున్నాయి. నదిని దాటి శత్రువులెవరూ రాకుండా సైనికులు ఇక్కడ పహారా కాస్తుంటారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని ఒక బురుజు చిత్రాన్ని ప్రచురిస్తూ దానికింద రామానాయుడి బురుజు అని రాశారు. బహుశా ఈ రెండు బురుజులలో ఒకదాని పేరు అది అయివుండవచ్చు. ఇది పరిశోధించాల్సిన అంశం.

    కొండారెడ్డి బురుజును ఎవరు కట్టించారు. అది ఎప్పుడు నిర్మించబడింది. దానికాపేరు ఎలా వచ్చింది అనే విషయాలను తెలిపే శాసనాలుగానీ, గ్రంథాలు గానీ ఏవీ లేకపోవడంతో ఈ విషయాలపట్ల చరిత్రకారుల్లో చాలా గందరగోళం నెలకొనివుంది....

    ఈ విధంగా 'కొండారెడ్డి బురుజు' పుస్తకంలో తెలుగుతోపాటు ఇంగ్లీషు భాషలో కూడా అనువాదం చేసి ప్రచురించారు. కొండారెడ్డి బురుజు చరిత్రను ఫోటోలతో చాలా సుందరంగా వివరించబడింది ఈ చిన్న పుస్తకంలో.

Write a review

Note: HTML is not translated!
Bad           Good