గిరిజనుల బ్రతుకులో చోటుచేసుకున్న మార్పులని ఆ మార్పుల వల్ల వారు అనుభవించిన మానసిక సంక్షోభాన్ని చక్కగా చిత్రీకరించిన ఈ నవలని అకాడెమీ మీ కందిస్తున్నది.
మన్నప్రాంతంలో పుట్టి పెరిగి పట్నంలో ఉద్యోగస్తుడైన శ్రీ నారాయన్‌ స్వానుభవం నుంచి రచించిన గిరిజనుల కథ-నాగరీక జీవితంలోకి అడుగుపెడుతున్న కొండదొరల కథ, ఈ నవల. ఆధునికతలో విలీనమైన, వ్యక్తిత్వం కోల్పోయి బ్రతకటమా లేక ఆధునికతని నిరాకరించి సంస్కృతికి అంగరక్షకుడుగా నిలవటమా, అనేది ''కొండదొరసాని''లో ప్రశ్నించబడింది.
కేరళలో పుట్టి పెరిగి మలయాళంలో గుర్తింపు పొందిన రచనలు చేసి, ఉద్యోగ రీత్యా విశాఖలో స్ధిరపడి తెలుగు నేర్చుకొని తెలుగులో రచనలు చేయసాగిన శ్రీ ఎల్‌.ఆర్‌.స్వామి (1944) రసాయన శాస్త్రవేత్త.

Write a review

Note: HTML is not translated!
Bad           Good