మామూలుగా నామిని రాసేవన్నీ కల్పిత పాత్రల మీద కాదని, వాళ్ళ ఊళ్ళో నిజంగా ఉండేవాళ్ల మీదే రాస్తాడని దాదాపు అందరూ అనుకుంటారు. నిజానికి పచ్చనాకు సాక్షిగా... సినబ్బకతలు, మిట్టూరోడి కతలు మాత్రమే ఈ కోవలోకి వస్తాయి. చెప్పాలంటే ఎనభైలలో కల్లూరు నుంచి మిట్టూరు వచ్చి కొంత నేలను గుత్తకు తీసుకొని ఒక కుటుంబం సేద్యం చేసింది. ఆ కుటుంబాన్నే ఆదర్శంగా తీసుకుని పేర్లు మార్చి మునికన్నడి సేద్యాన్ని రచయిత రాశాడు. ఇంకా సుందరమ్మ కొడుకులు, పాలపొదుగు నవలికల్లోని మనుషులు కూడా యథాతథంగా అవే పేర్లతో మిట్టూరులో లేరు. మూలింటామె, కొనమ్మి, పందొసంత కూడా అవే పేర్లతో ఉన్న వాళ్ళు కారు. ఈ కైగట్టిన కతల్లోని మనుషులు కూడా అవే పేర్లతో మిట్టూరులో లేరు. మామూలుగా పల్లెటూళ్లల్లో ఎవరైనా రంజుగా కథ చెబుతుంటే 'కతను కైగట్టి ఎంత బాగా చెప్తావుందో చూడు' అనేది మాట సామెత. అందుకనే ఈ జనం మాటనే పుస్తకానికి టైటిల్‌గా పెట్టాము. - టామ్‌సాయర్‌ బుక్స్‌

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good