కుటుంబరావు గారి ''కొల్లేటి జాడలు'' నవల చదువుతున్నంత సేపూ, ముగించిన తరువాతా కూడా కళ్ళనిండా అవే దృశ్యాలు. చదివి మనం ఊహించుకునేవి కావు. రచయిత దర్శకుడు ప్రతీ దృశ్యాన్ని తన ఏంగిల్‌లో కెమెరా నిలబెట్టి చిత్రానువాదాన్ని మనకి చూపిస్తున్నారు. ఈ నవలలో కనిపించే పిక్టోరియల్‌ క్వాలిటీ దాని ప్రధాన ఆకర్షణ. అందుకే దోనెలో కూచుని కొల్లేటిలో తిరుగుతున్న అనుభూతిని కలగచేస్తుంది. ఈ నవల ముగించిన కొన్ని రోజుల వరకూ కొల్లేటి దృశ్యాలు మనసుని కమ్ముకుంటాయి. కమ్ముకోవడం ఎందుకంటే కొల్లేరు ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం ఇప్పుడు. - తల్లావఝల పతంజలి శాస్త్రి
కొల్లేరు తీరం వెంబడి ఉండిన అటువంటి గ్రామాలన్నిటా - సహజంగానే - వంటా, తిండీ, పనీ పాటూ, గొడ్డూ గోదా, సంబరం వినోదం, అలవాట్లూ ఆచారాలూ ఇవన్నీ కూడా అక్కడ దొరికే చేపల చుట్టూ, పండే పంటల చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చాయి. ఆ మేరకు ప్రకృతితో, స్ధానిక భౌగోళిక నిర్ధిష్టలతో పెనవేసుకు పోయాయి. ఈ సహజ సంబంధాన్ని 'కొల్లేటి జాడలు' మనోహరంగా చిత్రిస్తుంది. ఇవేవీ తెలియని పాఠకులకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఈ నవలలోని సమాజం, బాగా 'అభివృద్ధి' చెందిన మైదాన ప్రాంతాల కన్నా 'వెనుకబడిన' గిరిజన సమాజానికి దగ్గరలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. - ఉణుదుర్తి సుధాకర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good