ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉందనే నమ్ముతున్నాను. ఆ ఇండియా బతికే ఉంది. అదే ఇప్పుడు మనకున్న పెద్ద ధైర్యం.

ప్రజాస్వామ్య సమాజంలో ఎప్పుడూ కొత్త ఆలోచనలు, విమర్శలు రావడం సహజం. ఆ విమర్శలు అవహేళనలుగా భావింపబడకుండా ఆత్మవిమర్శకు దారితీస్తే - మతానికైనా, దాని అనుయాయులకైనా, సమాజానికైనా చాలా మంచి జరుగుతుంది. దానికి బదులు మేము చెప్పిందే సరైంది, మా అభిప్రాయం మాత్రమే సరైంది అనే ధోరణి కనబరిస్తే ఆ మతం, దాని ఆరాధకులు, ఆ సమాజం అన్నీ నిలువు నీరులాగా  మారి పాచిపట్టి కంపుకొట్టడం మొదలవుతుంది.

పేజీలు : 231

Write a review

Note: HTML is not translated!
Bad           Good