కొలకలూరి ఇనాక్‌ కథలు మన కళ్ళముందు సజీవంగా కదలాడుతూ వుంటాయి. కొన్ని మనతో మాట్లాడతాయి. ఇంకొన్ని పోట్లాడతాయి. మరికొన్ని కొట్లాడతాయి. ఇంకా కొన్ని ఆప్యాయంగా మన భుజాల్ని నిమురుతాయి. అయితే, ఇవన్నీ అంతిమంగా ఎంతో ప్రేమతో మన కన్నీళ్ళను తుడుస్తాయి.

కొలకలూరి ఇనాక్‌ కథలను అర్ధం చేసుకోడానికి ఒకసారి కనీసం మానసికంగానైనా నిరుపేదలమవుదాం. అస్పృశ్యులమవుదాం. సంపన్న కులాల అణచివేతలను అనుభవిద్దాం. పెత్తందారి కులాల అమానుషత్వాన్ని చవిచూద్ధాం. పేదరికం, అస్పృశ్యత ఈ రెండూ జెమిలిగా చేసిన గాయాన్ని, వాటి పలవరింతలనూ ఏకకాలంలో అనుభవిద్దాం. కథకుని ముగింపులోని పచ్చిదనాన్ని అప్పుడే స్పృశించగలం. అందులోని పురుషార్థ ధర్నాన్ని అప్పుడే సమీక్షించగలం.

ఈ సంపుటిలోని కథల సమస్యలన్నీ కుల పీడనలతోనూ, ఆర్ధిక అంశాలతోనూ ముడిపడి వున్నవే. మార్క్సిజం లోని ప్రధాన సూత్రమైన వర్గ కలహ సిద్దాంతం వర్గ సమాజంలోని పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణను సూచిస్తుంది; స్వాగతిస్తుంది కూడా. ఈ సంపుటిలోని ప్రతి కథా ఏదో ఒక పార్శ్వంలో, ఎంతో కొంత పై సూత్రానికి కట్టుబడి ఉండటం ఒక విశేషం. సామాజిక సమస్యల నేపథ్యంలో దేశీయంగా ఉన్న కుల స్వభావాన్ని నొక్కిచెప్పడం ఈ కథల్లోని ఒక విశిష్టత. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good