సొసెకీ నట్సుమే జపాన్ దేశపు అత్యుత్తమ రచయితలలో ఒకరు. సాహితీ విమర్శకులు అమెరికన్ రచయిత హాథర్న్ తోను, ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగోతోను, ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్సుతోను ఈయన్ని పోలుస్తుంటారు. ఈయన 1867లో పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో చనిపోయాడు. ఆంగ్ల సాహిత్యంలో రీసెర్చ్ చేయడానికి  ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లండు నుంచి జపానుకు తిరిగి వచ్చాక కొంతకాలం తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే నాలుగేళ్లపాటు ప్రొఫెసరుగా పనిచేసాడు. ఆ తర్వాత టోకియో ఆసాహి షింబూన్ లో సాహిత్య శాఖ ప్రధానాచార్యులుగా చేరాడు. ఈ కాలంలోనే నవలలు రాయడం ప్రారంభించాడు. మొదటి నవల 'నేనొక పిల్లిని'. ఒక ప్రముఖ సాహిత్య పత్రికలో సీరియల్ గా వెలువడింది. ఈ నవలలో ఒక ప్రొఫెసర్ జీవితం అతని ఇంటిలోని పిల్లి దృష్టితో చిత్రింపబడింది. ఆ పత్రికలో ఆ నవల ఆఖరు అధ్యాయంలో పిల్లి చనిపోయినట్లు చదివి పాఠకులు భోరున ఏడ్చారట! ఆయన ఆఖరి నవలల్లో 'కొకొరో' ఒకటి.
ఆయన తోలి రచనల్లో తొంగి చూచిన హాస్యమూ ఆశావాదమూ  మలిరచనల్లో మాయమయ్యాయి. వాటిల్లో నిరాశావాదం ప్రవేశించింది. కొకొరో పాత్రలు విధినీ జీవితంలో ప్రతికూలతని బొత్తిగా ప్రతిఘటించకుండా లోంగిపోతాయి. ఆయన రచనా సంవిధానంలో మాత్రం పూర్తిగా పరిణతి కనిపిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good