హిందీ నటగాయకుడు కిశోర్‌కుమార్‌పై తెలుగులో వెలువడిన తొలి పుస్తకం "కిశోర్ జీవనఝరి". ఇది నవరసభరితమైన కిశోర్‌కుమార్ జీవితగాథ!
* అతడు నటుడు, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, హాస్యం, సంగీతం రంగరించిన కళాకారుడు
* ఎందరో ఉద్దండులు గడగడ వణికిన ఎమర్జన్సీ రోజుల్లో పాలకుల నెదిరించి కష్టనష్టాల కోర్చిన సాహసి. హీరోగా కనుమరుగైనా స్టేజిషోల ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చి "ఆరాధనా" ద్వారా గాయకుడిగా దూసుకువచ్చి ఆఖరిశ్వాస విడిచేవరకూ ఉన్నతస్థానంలో నిలిచిన ధీశాలి
* అతడు ఇన్‌కమ్ టాక్స్ కట్టని కారణంగా జైలు పాలయ్యాడు. టాక్సు తప్పించుకుందామని ఫ్లాప్ సినిమా తీయబోతే అది హిట్ అయికూచుంది! క్రేజీ మాస్టర్, పిసినారి అని సినీజనులు తిట్టుకున్నా, ప్రేక్షకులు, శ్రోతలు అతనికి బ్రహ్మరథం పట్టారు!
* మూడు పెళ్ళిళ్ళు ఫెయిలయ్యి నాలుగోసారి ఓ వితంతువును పెళ్ళాడితే, ఏడేళ్ళు తిరక్కుండా ఆమె మరోసారి వితంతువయ్యింది!
* * *
ప్రసాద్‌ రచనలో సుగుణం సంయమనం. ఆకాశానికి ఎత్తివేయడంగాని, పాతాళానికి అణగద్రొక్కటంగాని యిందులో లేదు. యీ పుస్తకంలో ఎక్కడా మనస్సు చివుక్కుమనిపించే మాటల్లేకపోవడం అందరినీ మెప్పిస్తుంది. అలా అని కిశోర్‌ పిచ్చికళలు, పెళ్లి చేష్టలు (నాలుగు!), వివాహానికి పూర్వమే సహనివాసం చేయడం - ఏదీ దాచిపెట్టబడలేదు..
-వి. ఎ. కె. రంగారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good