20వ శతాబ్దం మూడవ దశకంలో భావకవిత్వం పొంగు ఎత్తిన రోజుల్లో నండూరి సుబ్బారావు ఎంకిపాటు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు ‘‘సముద్రంలో నుంచి మంచుకొండు లేచి వచ్చినట్లుగా’’ ఉబికి వచ్చినాయి. ఎంకి పాటలు రసస్ఫూర్తి కలిగిన ఖండకావ్యం అయింది. కిన్నెరసాని పాటలు రసవంతమైన మహాకావ్యంగా రూపొందింది. ఒక కథను ఆశ్రయించి రస ఉద్విగ్నంగా, భావుకతర్పణంగా వచ్చిన మహాకావ్యం కిన్నెరసాని పాటలు. దీనికి పూర్వం వచ్చిన అబ్బూరి వారి నదీసుందరి కానీ, అంతకుముందు వచ్చిన వసుచరిత్రలోని కథ శుక్తిమతి కథ కానీ నదీ లక్షణానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించదు.

కిన్నెరసాని పాటలు ఒక కరుణ రస ప్రవాహంలాగా, కావ్యం కొనసాగుతూ కొనసాగుతూ కడలి రాజు చేసిన ఉన్మత్త కామోల్బణం తట్టుకొని, గోదావరి తల్లి ఒడిలో దాగి, తనని తాను రక్షించుకుని, కిన్నెరసాని చివరకు భద్రాద్రి రామయ్య సేవలో జీవితాన్ని గడపటం, యాత్రికులకు సేవ చేయటం, ఒక సుస్థితిని పొందడం ` శాంతరస ఆవిష్కరణానికి కారణమైంది. కావ్యం క్రమంగా కరుణం నుండి శాంతిరసం లోకి ఎదిగి వచ్చి ఒక ఆత్మ స్పర్శను కలిగించింది....

పేజీలు : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good