సిగరెట్‌ పొగను గాల్లోకి వదులుతూ రిలాక్సింగ్‌గా పడక కుర్చీలో వెనక్కివాలాను. నా మస్తిష్కంలో ఆలోచనలు కందిరీగల్లా తిరుగుతున్నాయి. అందుకు కారణం ఈ రోజు నా యాభై అయిదో జన్మదినం! నా జీవితంలో చాలా పుట్టిన రోజులు వచ్చాయి. వెళ్ళాయి. కానీ వాటికెలాంటి ప్రత్యేకతా లేదు.

కానీ ఈ రోజుకో ప్రత్యేకత వుంది. ఇంతవరకూ నా జీవిత గమనంలోని ముఖ్య సంఘటనలతో నా జీవిత చరిత్ర రాయాలని నిర్ణయానికి రావడమే ఆ ప్రత్యేకత. నా జీవితంలో నేను చాలా కష్టపడ్డాను.

చాలా చిన్నవయసులోనే బ్రతుకుతెరువుకోసం, నాతోటి పిల్లలంతా చదువుకుంటుంటే నేను మాత్రం ఓల్డ్‌ కాలనీలో రక-రకాల పనులు - అమ్మడం, కొనడం, వేట, పోరాటం లేదా గనులు తవ్వడం లాంటివెన్నో చేసేవాడ్ని.

నాకు హింస అంటే అసలు ఇష్టంలేదు. అందుకు కారణం నా లోలోపల దాగివున్న పిరికితనమే! అయితే నేను పిరికివాడినని బయటకు ఒప్పుకోవడం నాకెంతమాత్రం ఇష్టం వుండదు. నిజానికి నాకు సాహసాలంటే కూడా విరక్తే అని చెప్పాలి.

అలాంటి నేను నా సాహసగాధను రాయడానికి ఎందుకు సంకల్పించానా అని ఆలోచిస్తే నాకు నాలుగు కారణాలు కన్పించాయి....

పేజీలు : 180

Write a review

Note: HTML is not translated!
Bad           Good