ఇప్పుడు మీరు చద వబోతున్న కింగ్ మేకర్ - ఆంధ్ర ప్రభ దిన పత్రికలో 2003 లో ప్రతి సోమవారం ఈ శీర్షిక పేరిట నే శ్రీ సతీష్ చందర్ గారి వ్యంగ్య రచనలు వెలువడేవి. అప్పటి కాయన ఆ పత్రిలలో సంపాదకులుగా బాధ్యత నిర్వహిస్తూ ఈ రచనలు చేశారు. ఆ రచనల సంకనమే ఈ గ్రంధం.రచనాకాలం విచిత్రమైనది. - ఫీల్ గుడ్ అని దేశానికి భరోసా ఇచ్చిన శ్రీ వాజ్ పాయి పాలనకూ , నిద్రపోను - నిద్రపోనివ్వను అని రాష్ట్రానికీ కాపలా కాస్తున్న శ్రీ చంద్రబాబు సర్కారుకూ ఏడాదిలోగా శుభం కార్డు పదబోతుందని తెలియదు. క్లైమక్స్ లో కవ్వింపుల్లా ఈ రచనలు వచ్చాయి. ఇందులోంచి మచ్చుగా ఒకాటి.
దారిన పోయే దానయ్యను ప్రేమించడం ఎంత కష్టమో , ద్వేషించడమూ అంటే కష్టం. వాడిని పిలిచి ఉత్తపుణ్యాన కౌగాలించుకోలెం వెనక్కి తిరగమని చెప్పి - నదిమీద ఒక తన్ను తన్ననూలెం. కానీ మొదటి పనిని రాజకీయ నాయకులూ, రెండో పనిని పోలీసువాడూ - సునాయాసంగా చెయ్యగలరు. అందుకే ఇరువర్గాల వారికి ఒకరి అవసరం ఇన్కొకరికి వుంటుంది. రాజకీయ నాయకుడికి పదవి కావాలి. పోలీసాయనకి ప్రమోషన్ కావాలి . ప్రమోషన్ కి ఆశ చూపితే చాలు, పోలీసుకి  ఏ ఎమోషన్ కావాలంటే ఆ ఎమోషన్ వస్తుంది. ఆ కారణంగా కోపమూ వస్తుంది. తాపమూ వస్తుంది. కోపానికో హత్య , తాపానికో రేప్ - ఇవన్ని తెలిసిన విషయాలే. ఆ పనుల్ని బయట గుండాలు కూడా చేసి పెడతారు.ఒకసారి ఇలాగే బార్ లో దొంగపడ్డాడు అయితే పడ్డవాడు తాగుబోతు కాదు. అలాగయితే - కడుపునిండా తాగాక దొంగతనము చేయచ్చు అని భావించి. కావలసినంత సేవించి, అక్కడే పవళించి, ఉదయానికి నేరుగా బారు యజమానికే దొరికేవాడు - ఇలాగే జరిగితే - అలాగని ఏమీ చేయకుండా వదిలితే - పోలీసులు చేసే నేరాలు పెరిగిపోతున్నాయి. అని గోగ్గూలు పెట్టేవారు. రాజకీయ నాయకులకీ, పోలీసులకీ మద్య వున్నా అక్రమ సంబంధం గురించి నోరు విప్పారు. ఇలాంటి వ్యంగం చురకలు (46 ) ఉన్నాయి. ఇందులో .

Write a review

Note: HTML is not translated!
Bad           Good