డిసెంబరు నెల. చలిగా వుంది. మొహాలు మప్లర్లలో దాక్కున్నాయి. పెదవుల మధ్య ఎర్రగా, వెచ్చగా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఘాటైన పొగ తాగేవాళ్ళకే కాక ఎదుటివాళ్ళకు కూడా మత్తెక్కిస్తూ, వుషారు కలిగిస్తూ వుంది. ఆకలి, నిషా, జేబులో డబ్బు. మత్తెక్కిస్తున్న కళ్ళు. ఉబ్బిన మొహాలు. స్థిమితం తప్పిన ఒళ్ళు. తడబడే కాళ్ళు. రోజూ జరిగే తంతు. వాళ్ళేం చేస్తున్నారో, ఎవరి మనసుల్లో ఏ ఊహలు దాగున్నాయో, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవటానికి వాళ్ళను అడగాల్సిన పని లేదు. పరిశీలించవలసిన అవసరం కూడా లేదు.
పేపరు హెడ్ లైన్లలా దూరం నుండి కూడా వాళ్ళ మొహాల్లోని భావాల్ని చదవవచ్చు.
- ఆదాయ వనరుగా మారిన ఒక ఆడపిల్ల కథ

Write a review

Note: HTML is not translated!
Bad           Good